Saturday, August 30, 2025

టైమ్ 100 ఎఐ జాబితాలో కాగ్నిజెంట్ సిఇఒ రవి కుమార్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాగ్నిజెంట్ సిఇఒ రవి కుమార్ ఎస్ ప్రతిష్ఠాత్మక టైమ్ 100 ఎఐ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఎఐ రంగంలో దూరదృష్టి నాయకత్వం, ఎంటర్‌ప్రైజ్ ఎఐ అభివృద్ధికి చేసిన కృషికి ఈ గౌరవం లభించింది. 2023లో కాగ్నిజెంట్ 1 బిలియన్ పెట్టుబడి పెట్టి, సినాప్సె స్కిల్లింగ్ ఇనిషియేటివ్ ద్వారా దాదాపు 10 లక్షల మందికి ఎఐ నైపుణ్య శిక్షణ అందిస్తోంది. ఇటీవల 53 దేశాల్లో 53,000 ఉద్యోగులతో నిర్వహించిన జనరేటివ్ ఎఐ హాకథాన్ గిన్నిస్ రికార్డు సాధించింది. అంతేకాక, 5 లక్షలకుపైగా ఎఐ ఆవిష్కరణ ఆలోచనలను వెలికి తీయడానికి బ్లూబోల్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. వివిధ అంతర్జాతీయ బోర్డుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ, రవి కుమార్ గ్లోబల్ ఎఐ భవిష్యత్తుకు దారితీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News