Saturday, August 30, 2025

ప్రేమలో విఫలం… లైవ్ లో యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమ విఫలంకావడంతో చనిపోతున్నానని లైవ్ లో మాట్లాడి భగ్న ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో జరిగింది. అనంతపురం పట్టణానికి చెందిన అనిల్ అనే యువకుడు ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో అతడితో యువతి తెగదెంపులు చేసుకుంది. గాఢంగా ప్రేమించిన అమ్మాయి అనిల్ కు దూరం కావడంతో బరించలేకపోయాడు. దీంతో యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తాను సూసైడ్ చేసుకుంటున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేశాడు. తనని ప్రేమికురాలు వదిలేసిందని, తనకు ఎవరూ అవసరం లేదని, తన తల్లిదండ్రులు, స్నేహితులు అందరూ బాగుండాలని కోరుతూ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కనిపెంచిన తల్లిదండ్రుల కోసమైన బతకాల్సిందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రేమ కోసం ప్రాణాలు తీయడం, ప్రాణాలు తీసుకోవడం మంచిది కాదని నెటిజన్లు హితువు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News