Saturday, August 30, 2025

కూకట్ పల్లిలో భర్త గొంతుకోసి… భార్య ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

కూకట్ పల్లి: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ లో అప్పుల బాధతో భర్తను చంపి భార్య గొంతుకోసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కెపిహెచ్.బి కాలనీలో ఆరో ఫేజ్ లో రమ్యకృష్ణ, రామకృష్ణ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. అప్పుల బాధతో చనిపోదామని దంపతులు నిర్ణయం తీసుకున్నారు. మొదట భర్త రామకృష్ణ  గొంతు కోసి చంపిన తరువాత భార్య రమ్యకృష్ణ గొంతు కోసుకుంది. స్థానికులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ట్రంప్ వినాయక చవితి కానుక

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News