Sunday, August 31, 2025

క్లాస్‌గా కనిపించే మాస్‌ లీడర్‌ గోపీనాథ్‌: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన సభలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు  సంతాప తీర్మానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. క్లాస్‌గా కనిపించే మాస్‌ లీడర్‌ గోపీనాథ్‌ అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. విద్యార్థి దశలో రాజకీయాల్లో గోపీనాథ్ చురుగ్గా ఉన్నారని, 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారని, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌కు విశ్వాసమిత్రుడిగా గోపీనాథ్‌కు సత్సంబంధాలు ఉండేవని గుర్తు చేశారు. విద్యార్థినేతగా, ప్రజాప్రతినిధిగా, సినీ నిర్మాతగా రాణించారని, మాగంటి గోపీనాథ్ తనకు మంచి మిత్రుడు, సన్నిహితుడు అని రేవంత్ తెలియజేశారు. 2014, 2018, 2023లో ఎంఎల్‌ఎగా గోపీనాథ్ గెలిచి హ్యాట్రిక్ సాధించారన్నారు. గోపీనాథ్ అకాల మరణం ఆయన కుటుంబం, ప్రజలకు తీరనిలోటు అని అన్నారు. మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా నిలవాలన్నారు.

Also Read: నన్ను చంపితే డబ్బులు ఎవరు ఇస్తారో పోలీసులే తేల్చాలి: కోటంరెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News