Sunday, August 31, 2025

కాళేశ్వరం విషయంలో హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం కమిషన్ నివేదకను సస్పెండ్ చేయాలని కోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ వేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టొద్దని హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో హౌస్‌మోషన్ పిటిషన్ వేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదకను కొట్టివేయాలని గతంలో కెసిఆర్, హరీష్‌రావు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. పిటిషన్ల ఆధారంగా గతంలో నోటీసులు జారీ చేసి వాయిదా వేసిన విషయం విధితమే. అక్టోబర్ 7న కెసిఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News