- Advertisement -
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ అభిమానిగా మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లో అడుగుపెట్టారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. గోపీనాథ్ హైదరాబాద్ లో జన్మించి ఓయూలో విద్యాభ్యాసం చేశారని అన్నారు. శాసనసభలో మాగంటి గోపీనాథ్ కు సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. మొదట్నుంచి గోపీనాథ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారని, మాజీ సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారని తెలియజేశారు. గోపీనాథ్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని కెటిఆర్ పేర్కొన్నారు.
Also Read: క్లాస్‌గా కనిపించే మాస్ లీడర్ గోపీనాథ్: రేవంత్ రెడ్డి
- Advertisement -