- Advertisement -
హైదరాబాద్: యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బిఆర్ఎస్ యూరియా ఆందోళన కార్యక్రమం కపట నాటకం అని అన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. యూరియా కొరతకు గల కారణమేదో బిఆర్ఎస్ కు తెలియదా? అని రైతుల ముసుగులో తమ ప్రేరేపిత ఉద్యమాలు ప్రజలు హర్షిస్తారా? అని ప్రశ్నించారు. జియో పాలిటిక్స్ వల్ల దేశీయ ఉత్పత్తి డిమాండ్ కు తగ్గట్టు లేదని తెలియజేశారు. యూరియా కొరత ఉంటే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు? అని తుమ్మల నాగేశ్వరరావు నిలదీశారు.
Also Read : క్లాస్‌గా కనిపించే మాస్ లీడర్ గోపీనాథ్: రేవంత్ రెడ్డి
- Advertisement -