టీం ఇండియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించిన కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni). తన కెప్టెన్సీలో భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫి అందించాడు. అయితే 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన కెప్టెన్ కూల్.. అప్పటి నుంచి ఐపిఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపిఎల్‌లో కూడా వచ్చే సీజన్ నుంచి ఆడుతాడో? లేదో? అనుమానం ఉంది. అయితే ఇప్పుడు బిసిసిఐ ధోనీకి ఓ కీలక పదవిని కట్టబెట్టాలనే మోచనలో ఉందని సమాచారం.
2021 టి-20 ప్రపంచకప్ సమయంలో ధోనీని (MS Dhoni) జట్టు మెంటార్‌గా బిసిసిఐ నియమించింది. అయితే అది కేవలం ఆ టోర్నమెంట్ వరకే ఒప్పందం కుదుర్చుకుంది. అయితే త్వరలో ధోనీని పూర్తిస్థాయిలో ఈ పదవిలో కూర్చొబెట్టాలని బిసిసిఐ ఆఫర్ ఇచ్చిన్టుల క్రికెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి, ధోనీకి మధ్య విబేధాలు ఉన్నాయి. జట్టు విజయంలో కెప్టెన్ అయిన ధోనీకే ఆ క్రెడిట్ ఇవ్వడం కరెక్ట్ కాదని గంభీర్ చాలాసార్లు అన్నారు. జట్టు మొత్తం కష్టపడి ఆడితేనే విజయం సాధించగలమవి లేకపోతే కష్టమని గంభీర్ చెప్పారు. మరి ఇప్పుడు తనకంటే పై పదవి ధోనీకి ఇస్తే.. గంభీర్ అందుకు అంగీకరిస్తారో.. లేదా కాదంటారో.. ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read : దాని గురించి మాట్లాడను.. విడాకులపై తొలిసారి స్పందించిన షమీ