హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై ఆదివారం నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు. శాసనసభ వ్యవహారాల కమిటీ(బిఎసి) సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నివేదికపై ఆదివారం అసెంబ్లీలో చర్చ జరుగుతుందని అన్నారు. బిసి రిజర్వేషన్ బిల్లును ఆదివారం సభలో ప్రవేశపెడతామన తెలిపారు.
కాళేశ్వరంపై బిఆర్‌ఎస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు నిర్ణయం స్పీకరే తీసుకుంటారని శ్రీధర్ బాబు (Sridhar Babu) పేర్కొన్నారు. అన్ని అంశాలపై చర్చ చేయాలంటే నాలుగైదు రోజుల సమయం తర్వాత సభను నిర్వహిస్తామని తెలిపారు. గణేష్ నిమజ్జనం, వరదల దృష్ట్యా సభను వాయిదా వేస్తామని అన్నారు. మరోవైపు బిఆర్ఎస్ పార్టీ బిఎసి సమావేశం నుంచి వాకౌట్ చేసింది. ఎరువుల కొరత, వరదలు, రైతుల సమస్యలపై ఆదివారం సభలో చర్చ జరగాలని బిఆర్‌ఎస్ సమావేశంలో కోరింది. సరైన హామీ రాకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేసింది.
Also Read : యూరియా కొరతకు గల కారణమేదో బిఆర్ఎస్ కు తెలియదా?: తుమ్మల