Sunday, August 31, 2025

పొలార్డ్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..

- Advertisement -
- Advertisement -

వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు కీరన్ పొలార్డ్ (Kieron Pollard) ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా టి-20ల్లో 14 వేల పరుగులు చేయడంతో పాటు.. 300 వికెట్లు తీసిన ఆటగాడి పొలార్డ్ నిలిచాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పొలార్డ్ ఈ ఘనత సాధించాడు. ఈ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న పోలార్డ్.. బార్బడస్ రాయల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ని తన సొంతం చేసుకున్నాడు.

తన కెరీర్‌లో 712 టి-20 మ్యాచులు ఆడిన పొలార్డ్ (Kieron Pollard) 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఒక్కడే. గేల్ తర్వాతి ఈ రికార్డు సాధించిన ఆటగాడిగా పొలార్డ్ నిలిచాడు. 14 వేల పరుగులతో పాటు 332 టి-20 వికెట్లు కూడా తీశాడు పొలార్డ్. పొలార్డ్ కంటే ముందు ఈ రికార్డు ఆఫ్ఘానిస్థాన్ టి-20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ 488 మ్యాచుల్లో కలిపి 661 వికెట్లు తీశాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బార్బడస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన నైట్‌రైడర్స్ జట్టు 17.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 179 పరుగులు చేసి మ్యాచ్‌లో విజయం సాధించింది.

Also Read : కీలక నిర్ణయం తీసుకున్న ద్రవిడ్.. ఆ జట్టు కోచ్ పదవికి గుడ్‌బై

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News