- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ మంత్రి, ఎంఎల్‌ఏ హరీష్ రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. శనివారం హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక ప్రవేశపెట్టడకుండా చూడాలని, చర్చ, చర్యలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. అయితే ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ వద్ద పెండింగ్‌లో ఉంది. కాగా, గతంలోనే హరీష్ రావు, కెసిఆర్ కాళేశ్వరం నివేదిక రద్దు చేయాలని కోరుతూ వేరువేరుగా హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లు విచారించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాడానికి గడువు ఇస్తూ నాలుగు వారాలు వాయిదా వేసింది.
- Advertisement -