న్యూయార్క్ : భారత్ సహా పలు దేశాలపై భారీ సుంకాల విధింపు విషయంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చర్య అనుచితం అని అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు తెలిపింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ విషయంలో అత్యవసర అధికారాలను వాడుకోవడం చట్ట విరుద్ధమని శుక్రవారం ఈ కోర్టు తెలిపింది. అయితే టారిఫ్ విధింపు జరిగినందున ప్రస్తుతానికి యధాతథ స్థితి ఉంటుందని కోర్టు పేర్కొంది. అక్టోబర్ నెల మధ్య వరకూ ఈ పెంచిన సుంకాల అమలునకు అనుమతిని ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. దాదాపుగా ప్రతి దేశంపై కూడా వదలకుండా టారీఫ్ల మోతకు దిగడం చట్ట వ్యతిరేకం అని ఫెడరల్ సర్కూట్ సంబంధిత యుఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ స్పందించింది. అయితే ట్రంప్ ఈ చర్యలను అమెరికా ఆర్థిక రంగ రక్షణ ప్రాకారం నిర్మించే క్రమంలో చేపట్టిన చర్యలుగా భావిస్తున్నామని కూడా తక్షణం ఈ సుంకాల నిషేధంపై స్పందించలేదు. అయితే ప్రెసిడెంట్ అపరిమిత అధికారాలపై చట్టసభలు ఏమైనా చర్య తీసుకుంటే తప్పితే ఈ టారీఫ్లపై ఏమి చేయలేమని పేర్కొంటూ ఇవి చట్టవిరుద్ధం అని తేల్చారు. ఈ విషయంపై పరస్పర వ్యాజ్యాలకు సుప్రీంకోర్టు వరకూ వెళ్లవచ్చునని పేర్కొన్నారు.
ప్రెసిడెంట్ ఈ టారీఫ్లకు దిగాలనుకున్నారు. దిగారు. ట్రంప్ సుంకాలు అక్రమం అంటూ ఏడుగురు న్యాయమూర్తులు, ఆర్థిక పరిధిలో సక్రమమే అని నలుగురు జడ్జిలు వెలువరించిన ఈ 7ః 4 తీర్పు క్రమంలో ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ట్రంప్ అధికార యంత్రాంగం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు అమలులోకి వచ్చాయి. ఈ దశలో వీటిపై పునరాలోచన కానీ, సమీక్ష కానీ ఎత్తివేతలు లేదా ఉపసంహరణలు కానీ జరిగితే అది అమెరికాకు , అమెరికా ఆర్థిక రంగానికి తీవ్రస్థాయి ఇబ్బందికరమే కాకుండా తీవ్రసంక్షోభానికి దారితీస్తుందని ఈ తీర్పుపై ట్రంప్ తక్షణం స్పందించారు. మన తయారీదారులను , రైతులను అణగదొక్కేందుకు మిత్రదేశాలు నుంచి కానీ శత్రుదేశాల నుంచి కానీ భారీ స్థాయిలో సాగుతోన్న టారీఫ్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్యకు దిగామని, దీనిని నిలిపివేస్తే , టారీఫ్లకు బ్రేక్ వేస్తే అది అమెరికా ఆర్థిక నాశనానికి దారితీస్తుందని ట్రంప్ హెచ్చరించారు.