Tuesday, September 2, 2025

నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని అత్యున్నత న్యాయస్థానం సు ప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సమర్థిం చింది. తెలంగాణలో వరుసగా 9 ,10, 11,12 తరగతులు చదివితేనే లోకల్ అంటూ స్పష్టం చేసింది. అయితే ఈ రూల్స్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రం మినహాయింపు ఉంటుందనే షరతు సుప్రీంకోర్టు పెట్టింది. లోకల్ రిజర్వేషన్లపై తెలంగాణ ప్ర భుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా సుప్రీం కోర్టు కీల క తీర్పునిచ్చింది. వరుసగా నాలుగేళ్లు అంటే 9వ, 10వ తరగతులతో పాటు ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం తెలంగాణలో చదివితేనే స్థానికుడిగా పరిగణించాలని కోర్టు స్పష్టంచేసింది. తెలంగాణలో స్థానిక రిజర్వేషన్ల అంశం పై వివాదాస్పదంగా కొనసాగుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 33 ప్రకారం ఇంటర్మీడియట్‌కు ముందు వరుసగా నాలుగేళ్లు (9,10, ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం) చదివిన విద్యార్థులనే స్థానికులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. కానీ, కొందరు విద్యార్థులు దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా, ఆ జీవోను కొట్టివేయగా, తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలు వరించింది. ప్రతి రాష్ట్రం తన స్థానిక రిజర్వేషన్ల కోసం తగిన నిబంధనలు రూపొందించుకునే అధికారం ఉందని తమకు ఉందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత తమ పిల్లలు తమ పిల్లలు వేరే రాష్ట్రంలో (ఏపిలో) చదవాల్సి వచ్చిందని, కావున వారిని కూడా స్థానికులుగా పరిగణించాలని మెడికల్ కోర్స్‌లకు దరఖాస్తు చేసుకున్న అభ్య ర్థుల తరపున పిటిషనర్లు వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో లోకల్ కోటా పై జీవో 33 ను అమలు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విన్నవించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలపై జస్టిస్ గవాయ్ పలు ప్రశ్నలు వేసారు. రాష్ట్రంలో పుట్టిన, పదో తరగతి వరకు చదివిన, తల్లిదండ్రు లు ఇక్కడే శాశ్వత నివాసం ఉన్న విద్యార్థి వేరే రాష్ట్రాల్లో ఇంటర్ చదివారన్న కారణంతో వారి ప్రవేశాలను నిరాకరించవచ్చా? జెఇఇ, నీట్ శిక్షణ నిమిత్తం రాజస్థాన్‌లోని కోటాకు దేశం నలుమూలల నుంచీ విద్యార్థులు వెళ్తుంటారు కదా? అలా వెళ్లిన వారి పరిస్థితి ఏంటి? న్యాయమూర్తి ప్రశ్నించారు.

ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఎఎస్ అధికారి డిప్యుటేషన్‌పై ఢిల్లీ వెళ్తే, అప్పుడు ఆయన కుమారుడు దిల్లీలో ఇంటర్ చదివాడని పక్కన పెడతారా? స్థానికత నిబంధన గురించి తెలియని విద్యార్థులు వేరే రాష్ట్రంలో చదువుకోవడానికి వెళితే అక్కడా, ఇక్కడా స్థానికులు కాకుండా పోయే ప్రమాదం ఉంది కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు తప్పని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్నారని దాంతో వారి పిల్లల కు ఈ జీవో 33 నుంచి మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రాష్ట్రప్రభుత్వ వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అయితే గత ఏడాది హైకోర్ట్ ఇచ్చిన తాత్కాలిక మినహాయింపుతో స్థానిక కోటా కింద ప్రయోజనం పొందిన విద్యార్థులు తమ ప్రయోజనాలను కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఇక నుంచి ఎంబిబిఎస్, బిడిఎస్ యూజి కోర్సులలో జీవో 33 ప్రకారమే స్థానిక కోటా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే జీవో 33 నుంచి మినహాయింపు ఇవ్వడం పట్ల ప్రైవేటు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కూడా తప్పని పరిస్థితు ల్లోనే రాష్ట్రాన్ని వదిలి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేయాల్సి వస్తుందని తమ పిల్లల భవిష్యత్ గురించి ప్రభుత్వము కోర్టులు ఆలోచించాలని కోరుతున్నారు.

సుప్రీం’ తీర్పుపై నీట్ పేరెంట్స్ అసోసియేషన్ హర్షం
మెడికల్ అడ్మిషన్లో స్థానికత అన్న అంశంపై ఎట్టకేలకు నీట్ అభ్యర్థుల పేరెంట్స్ అసోసియేషన్ విజయం సాధించింది. మెడికల్ అడ్మిషన్లో స్థానికత కోసం తీసుకు వచ్చిన జీఓ 33ని తప్పకుండా అమలు చేయాలని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఇటీవల సుప్రీం కోర్ట్టు సీనియర్ న్యాయవాదులు విశ్వనాథుల రమేష్ , ఏ పద్మాచారి ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్ట్టుకు తమ వాదనను లిఖితపూర్వకంగా అందజేసారు. ఈ క్రమంలో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదవాల్సిందేనని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించడం పట్ల నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయ ణ చారి, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ తమ పరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు విశ్వనాథుల రమేష్, పద్మాచారికి అభినందనలు తెలి పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News