మన తెలంగాణ/ హైదరాబాద్: దుద్దిళ్ల శ్రీపాదరావు ఆలిండియా ఓపెన్ 1600 ఫైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ కిడ్స్‌కు చెందిన మాస్టర్ ఇమదాబత్తిని జోయల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన చెస్ ఛాంపియన్‌షిప్‌లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 784 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. అండర్7 నుంచి అండర్ 91 విభాగం వరకు పోటీలు నిర్వహించారు. కాగా, తెలంగాణకు చెందిన పదేళ్ల జోయల్ 9 పాయింట్లు సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు. తెలంగాణ కిడ్స్‌కు చెందిన షర్జిల్ హసన్ షేక్ రన్నరప్‌ను సాధించాడు. తెలంగాణ కిడ్స్‌కే చెందిన మనీష్ రెడ్డి లింగ్ సెకండ్ రన్నరప్‌ను దక్కించుకున్నాడు. తెలంగాణ కిడ్స్‌కు చెందిన 15 ఏళ్ల ఇర్ఫాన్ ఐదో స్థానంలో నిలిచాడు. విజేతలకు తెలంగాణ ఒలింపిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి పి.మల్లారెడ్డి, వెంకటేశ్వర రావు, లక్ష్మిరెడ్డి తదితరులు బహుమతులు అందజేశారు.
శ్రీపాదరావు చెస్ ట్రోఫీ విజేత జోయల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -