Tuesday, September 2, 2025

పిల్లలకు, పెద్దలకు నచ్చే సినిమా

- Advertisement -
- Advertisement -

సూపర్ హీరో తేజ సజ్జా పాన్ -ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో సూపర్ హీరో తేజ సజ్జా మాట్లాడుతూ “యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ, ఎమోషన్స్ తదితర అంశాలతో ఉన్న సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి థియేటర్స్‌లో ఎంజాయ్ చేసే సినిమా ఇది. పిల్లలకు, పెద్దలకు అందరికీ నచ్చే సినిమా. -మిరాయ్ అంటే హోప్ ఫర్ ఫ్యూచర్.

దీనికి మరో అర్థం కూడా ఉంది. అది సినిమాలో చూస్తున్నప్పుడు కచ్చితంగా సర్‌ప్రైజ్ అవుతారు. -మన ఇండియన్ సినిమాకి జపాన్, చైనీస్‌లో చాలా మంచి మార్కెట్ ఉంది. హనుమాన్ కూడా చైనా, జపాన్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా అక్కడ ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ఉంది. -కథలో సరైన సమయంలో శ్రీరాముని నేపథ్యం వస్తుంది. కచ్చితంగా సినిమాలో చాలా సర్‌పైజింగ్‌గా ఉంటుంది. -హనుమాన్ సినిమా అంజనాద్రి అనే ఒక ఫాంటసీ ప్రాంతంలో జరిగిన కథ. మిరాయి దేశాలు దాటి జరిగే కథ. క్యారెక్టర్స్ పరంగా హనుమాన్, మిరాయ్ డిఫరెంట్ ఫిలిమ్స్. -ఈ సినిమాకి ఫాస్ట్ యాక్షన్ చేశాం. రెగ్యులర్ స్టైల్ ఆఫ్ యాక్షన్ ఇందులో ఉండదు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఈ సినిమాకి పనిచేశారు. – శ్రీలంక, హిమాలయాస్, నేపాల్… ఇలా ఎన్నో అద్భుతమైన లైవ్ లొకేషన్స్ లో ఈ సినిమాని షూట్ చేయడం జరిగింది”అని అన్నారు.

Also Raad : ఆఫ్ఘన్ లో భారీ భూకంపం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News