రాయ్ పూర్: చత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసు ఇన్ ఫార్మర్లుగా ముద్రవేసి ఇద్దరు గ్రామస్తులను మావోయిస్టులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. అనంతరం ఎవరైనా పోలీసు ఇన్ ఫార్మర్ గా మారితే ఇదే గతి పడుతుందని గ్రామస్తులను మావోలు హెచ్చరించారు. మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. 2026లో చివరి వరకు మావోయిస్టులను లేకుండా అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలుమార్లు చెప్పారు.
- Advertisement -