Tuesday, September 2, 2025

యాక్షన్ సీక్వెన్స్‌లు క్రేజీగా ఉంటాయి

- Advertisement -
- Advertisement -

ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మదరాసి’. శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో లవ్, యాక్షన్ రెండు పిల్లర్స్. అందులో లవ్ పోర్షన్ అద్భుతంగా రావడానికి కారణం హీరోయిన్ రుక్మిణి. ఈ సినిమాలో మరో పిల్లర్ విలన్ విద్యుత్ జమ్వాల్.

ఆయనతో చేసే యాక్షన్ సీక్వెన్స్ చాలా క్రేజీగా ఉంటాయి”అని అన్నారు. హీరోయిన్ రుక్మిణి వసంత్ మాట్లాడుతూ “ఈ సినిమా నాకు చాలా స్పెషల్. కచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు”అని పేర్కొన్నారు. ప్రొడ్యూసర్ ఎన్‌వి ప్రసాద్ మాట్లాడుతూ “శివ కార్తికేయన్ ఈ సినిమాలో హీరో కావడం మా అదృష్టం. అమరన్ తర్వాత వస్తున్న ఈ సినిమాని ఎక్కడ రాజీ పడకుండా చాలా ప్రతిష్టాత్మకంగా తీశాం. అనిరుద్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు”అని తెలిపారు. ఈ సమావేశంలో బీస్ట్‌బెల్స్ ఉదయ్ పాల్గొన్నారు.

Also Read : పిల్లలకు, పెద్దలకు నచ్చే సినిమా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News