- Advertisement -
అమరావతి: ఏ పంట వేసినా గిట్టుబాటు ధర లేదని, ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి ఉల్లి కొనుగోలు చేయాలని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైెెఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా వేంపల్లి మండలం తాళ్లపల్లిలో ఉల్లి పంటను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. రైతులకు కూలీ ఖర్చులు కూడా రావడం లేదని, రైతులతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుందని మండిపడ్డారు. కమీషన్ల కోసం ప్రభుత్వం బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మా హయాంలో ఏనాడు ఎరువులను బ్లాక్ లో అమ్మలేదని, రైతులతో కూటమి సర్కార్ ఆడుకుంటుందోని విమర్శలు గుప్పించారు. అరటి రైతులు కూడా నష్టపోతున్నారని ధ్వజమెత్తారు.
- Advertisement -