Tuesday, September 2, 2025

వాళ్లను నక్సలిజం వైపు మళ్లించే కుట్ర జరుగుతోంది: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నక్సల్స్ సిద్ధాంతాన్ని అంతం చేయలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పోలీసుల త్యాగాలను అవమానపరచడమేనని, రేవంత్ హోంమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తూ తెలంగాణ పోలీసులకు గౌరవం ఇవ్వరా? అని అడిగారు. మాజీ నక్సలైట్లు రాష్ట్ర కేబినెట్‌లో కూర్చున్నారని, నక్సలైట్‌ను పద్మ అవార్డుకు సిఫారసు చేస్తారా? అని బండి దుయ్యబట్టారు. నక్సల్స్ భావజాలం ఉన్నవారే విద్యా కమిషన్‌లో ఉన్నారని, ఉపరాష్ట్రపతి అభ్యర్థిది కూడా అదే సిద్ధాంతమని ధ్వజమెత్తారు. తెలంగాణ యువతను తిరిగి నక్సలిజం వైపు మళ్లించే కుట్ర జరుగుతోందని, తాము నక్సలిజాన్ని అంతమొందిస్తామని బండి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2026 నాటికి నక్సలిజం లేకుండా చేస్తామన్నారు. అతివాద హింస కన్నా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఎప్పుడూ ఉన్నతమైనవేనని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News