- Advertisement -
హైదరాబాద్: కాళేశ్వరం నివేదికపై సిబిఐ విచారణకు హైకోర్టు బ్రేక్ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట కలిగింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు హైకోర్టు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా బిఆర్‌ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడంపై బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.
- Advertisement -