Tuesday, September 2, 2025

రాజకీయ నేతలను మాత్రమే బలిపశువులను చేయడం సరికాదు: దానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావు వెనక సిఎం రేవంత్ రెడ్డి ఉన్నాడనేది రాజకీయ ఆరోపణ మాత్రమే అని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై లోతైన విచారణ జరగాలని అన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై దానం స్పందించారు. రాజకీయ నేతలను మాత్రమే బలిపశువులను చేయడం సరికాదని విమర్శించారు. కొందరు అధికారుల దగ్గర వందల కోట్లు బయటపడుతున్నాయని, అలాంటి అధికారుల సంగతి ఏంటీ? అని ప్రశ్నించారు. తనకు స్పీకర్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని దానం నాగేందర్ పేర్కొన్నారు.

Also Read : మార్వాడి వ్యక్తిపై బిజెపి కార్పొరేటర్ దాడి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News