హైదరాబాద్: బిఆర్ఎస్ నేతలు వచ్చారు కానీ.. బిజెపి ముఖం చాటేసిందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిసి రిజర్వేషన్లపై నిన్న గవర్నర్ వద్దకు అఖిలపక్షం వెళ్లిందని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. బిసి ఓట్లతో గెలిచిన నాయకులు ఎందుకు స్పందించట్లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 3 చట్టాలు తెచ్చినా బిజెపి అడ్డుపడుతోందని మండిపడ్డారు. బిసి నాయకులమని, బిసి బిడ్డలం అని చెప్పుకునే అర్హత ఎక్కడిదని నిలదీశారు. మాజీ సిఎం కెసిఆర్ కుటుంబం రాష్ట్ర ప్రజల సొత్తు దోచుకుంటుందని, ప్రజా క్షేత్రంలో బిఆర్ఎస్ కు శిక్షపడిందని విమర్శలు గుప్పించారు.
ఘోష్ కమిషన్ నివేదికపై తదుపరి చర్యల నిర్ణయం బిజెపిపై ఉందని, బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎమ్మెల్సీ కవిత భాగస్వామిగా ఉన్నారని తెలియజేశారు. కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోవాలని కెసిఆర్ ను కవిత ఎప్పుడైనా అడిగారా? అని, కవితకు ఈ రోజు కనబడుతున్న అవినీతి ఆ రోజు ఎందుకు కనబడలేదని మహేష్ గౌడ్ అని ప్రశ్నించారు. పంపకాల్లో తేడా జరిగి ఉండవచ్చని.. అవినీతి జరిగింది వాస్తవమని, వాటాల్లో తేడా తప్ప.. ప్రజా సొమ్ము దుర్వినియోగం జరిగిందనేది వాస్తవం అని మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు.
Also Read : రాజకీయ నేతలను మాత్రమే బలిపశువులను చేయడం సరికాదు: దానం