Wednesday, September 3, 2025

కవిత వెనుక ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారు: సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌తో కలిసి కోట్ల మంది నడిచారని మాజీ మంత్రి సత్యవతి రాథోఢ్ (Satyavathi Rathod) అన్నారు. బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సి కవితను సస్పెండ్ చేసిన నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. పార్లీకి జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని.. కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కవిత మాటలు లక్షలాది బిఆర్ఎస్ కార్యకర్తలను బాధపెట్టాయని అన్నారు.

పార్టీ పెట్టినప్పటి నుంచి కెసిఆర్‌కు కుడి భుజంగా హరీశ్‌రావు ఉన్నారని తెలిపారు. కొన్నాళ్లు కెటిఆర్‌పై విమర్శలు చేశారు. ఇఫ్పుడు హరీశ్‌రావుపై చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘కవిత వెనుక ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారని మాకు అనిపిస్తోంది. కవితకు మా నాయకుడు కెసిఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఒకసారి ఎంపిని చేశారు. తర్వాత ఓడిపోయినా ఎమ్మెల్సీని చేశారు. కెసిఆర్ కుమార్తెగా కవితకు పార్టీలో ఎంతో గౌరవం దక్కింది. ఇవాళ అన్నీ మర్చిపోయి పార్టీ గురించి చెడుగా మాట్లాడటం సరికాదు. పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత అని అన్నారు. నువ్వుంటే ఎంత పోతే ఎంత అని కార్యకర్తలు అనుకుంటున్నారు’’ అని సత్యవతి (Satyavathi Rathod) పేర్కొన్నారు.

అనంతరం గొంగిడి సునిత మాట్లాడుతూ.. కవిత విషయంలో కెసిఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని తెలిపారు. ‘‘కెసిఆర్ తన ప్రాణాలని పణంగా పెట్టి తెలంగాణ సాధించారు. ప్రజలు కోరుకున్న విధంగా ముందుకు వెళ్లాలని కెసిఆర్ ఆలోచిస్తున్నారు. వరంగల్ సభలో దేశమంతా హర్షించేలా కెసిఆర్ ప్రసంగించారు. అందరికీ నచ్చిన ప్రసంగాన్ని కవిత తప్పుపట్టారు. పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత అని మాట్లాడటం సరికాదు. తనకు తానే స్థాయి తగ్గించుకునేలా కవిత మాట్లాడారు. పార్టీకి ఎంతోమంది ద్రోహం చేశారు.. వారిలో ఒకరిగా మీరూ ఉండాలని అనుకుంటున్నారా? ఎవరో తన భుజం మీద తుపాకీ పెట్టి బిఆర్ఎస్ పైకి గురిపెట్టారు. ఆ విషయాన్ని కవిత అర్థం చేసుకోవాలి. కవిత తనగొయ్యి తానే తొవ్వుకున్నారు’’ అని సునిత అన్నారు.

Also Read : కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : వివేకానంద

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News