Wednesday, September 3, 2025

పవన్‌ బర్త్‌డే స్పెషల్.. ‘ఒజి’ నుంచి క్రేజీ అప్‌డేట్

- Advertisement -
- Advertisement -

సెప్టెంబర్ 2, ఎపి డిప్యూటి సిఎం, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ, సిఎం చంద్రబాబు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులుతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే పవన్‌ ఇటీవలే ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. త్వరలో ఆయన ‘ఒజి’ (Pawan Kalyan OG) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఒక రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్‌లు ‘ఒజి’ క్రేజ్‌ను మరింత పెంచేశాయి.

అయితే పవన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ మరో క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చింది. ‘హ్యాపి బర్త్‌డే ఒజి’ అనే పేరుతో ఓ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియో విలన్‌ ఇమ్రాన్ అష్మి ‘డియర్ ఒజి’ (Pawan Kalyan OG) అంటూ చెప్పే డైలాగ్‌తో ప్రారంభం అవుతోంది. ఈ వీడియో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. చివర్లో పవన్‌కళ్యాణ్ కటానాతో కనిపించి ఫ్యాన్స్‌ని ఖుషి చేశారు. ఇక ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. థమన్ సంగీతం అందించారు. ఈ సెప్టెంబర్ 25వ తేదీన సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read : పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News