Wednesday, September 3, 2025

మనుషులను చంపితే నక్సలిజం పోదు:ఎంపి మల్లు రవి

- Advertisement -
- Advertisement -

మనుషులను చంపితే నక్సలిజం పోదని కాంగ్రెస్ పార్టీ ఎంపి మల్లు రవి అన్నారు. బిజెపి అంటేనే బిజినెస్ పార్టీ అని ఆయన విమర్శించారు. నక్సల్స్‌కు ఒక ఫిరాసఫీ, సిద్ధాంతం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని ఎంపి మల్లు రవి మంగళవారం పార్టీ నాయకులు రాములు నాయక్, శ్యాం మోహన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. పేద ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావాలన్నది ముఖ్యమంత్రి అభిమతమని మల్లు రవి అన్నారు. నక్సల్స్ కూడా సామాజిక ఆర్థిక అసమానతలు దూరం కావాలని కోరుకుంటారని ఆయన తెలిపారు. సల్వాజుడుం విషయంలో వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి’ కూటమి

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిందని బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడంలో అర్థం లేదన్నారు. ఛత్తీస్‌ఘడ్‌లో సల్వాజుడుం వాళ్ళు, వాళ్ళను వాళ్ళే చంపుకునే వ్యవస్థను జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యతిరేకించారని ఆయన వివరించారు. ప్రతి పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందాలని కోరుకునే నక్సల్స్ ఫిలాసఫీని ముందు పెట్టుకోవడంలో తప్పేమి లేదన్నారు. అంత మాత్రాన తీవ్రవాదాన్ని ప్రోత్సహించినట్లు కాదన్నారు. టెర్రరిజానికి, నక్సలిజానికి తేడా ఉందని మల్లు రవి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండ్ సంజయ్ విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News