- Advertisement -
న్యూఢిల్లీ: పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఓ గ్రామమే ధ్వంసం అయింది. ఈ విపత్తుకు కనీసం 1000 మంది బలయ్యారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బతికిబయట పడ్డట్టు సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్/ఆర్మీ సోమవారం తెలిపింది. రోజుల తరబడి కురిసిన భారీ వర్షాల తర్వాత ఆగస్టు 31 కొండచరియలు విరిగిపడ్డాయని అబ్దుల్ వాహిద్ ముహమ్మద్ నూర్ నేతృత్వంలోని బృందం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలావుండగా సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్/ఆర్మీ నిరాశ్రయులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి వెంటనే సాయం అందించాలని ఐక్యరాజ్యసమితిని కోరింది. అక్కడ రెండు సంవత్సరాలుగా జరుగుతున్న అంతర్యుద్ధ కారణంగా సగం జనాభా ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. లక్షలాది మంది ఉత్తర దార్‌ఫర్ రాజధాని అల్‌ఫషీర్ వదిలి వెళ్లిపోయారు.
- Advertisement -