Wednesday, September 3, 2025

ఇద్దరు గ్రామస్థులను చంపేసిన నక్సల్స్

- Advertisement -
- Advertisement -

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇద్దరు గ్రామస్థులను నక్సల్స్ చంపేశారని పోలీసులు మంగళవారం తెలిపారు. కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సేటి గ్రామంలో ఇద్దరిని నక్సల్స్ చంపేశారన్న సమాచారం అందినట్లు ఓ అధికారిక సమాచారం పేర్కొంది. ‘పోలీసులు దీనిపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోడానికి సిద్ధం అవుతున్నారు. వివరాలు తరువాత తెలియజేస్తాం’ అని వారన్నట్లు కూడా ఆ అధికారిక సమాచారం తెలిపింది. ఈ ఘటనతో ఈ ఏడాది నక్సల్స్ చర్యలకు బస్తర్ ప్రాంతంలో మొత్తం 35 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. బస్తర్ ప్రాంతం సుక్మా సహా ఏడు జిల్లాలు కలిగి ఉంది. బీజాపూర్‌లో ఆగస్టు 29న ఓ ‘శిక్షాదూత్’(తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాల విజిటింగ్ టీచర్)ను నక్సలైట్లు అపహరించి, తర్వాత చంపేశారన్నది ఇక్కడ గమనార్హం. ఇదే విధంగా ఆగస్టు 27న సుక్మా జిల్లాలో మరో ‘శిక్షాదూత్’ను నక్సల్స్ చంపేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News