Thursday, September 4, 2025

కెసిఆర్, హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

కెసిఆర్, హరీశ్‌కు హైకోర్టులో ఊరట
జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా
సిబిఐ దర్యాప్తు వద్దన్న హైకోర్టు మధ్యంతర
ఉత్తర్వులు జారీ అక్టోబర్ 7కు విచారణ
వాయిదా వేసిన న్యాయస్థానం
మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రా జెక్టుపై జ స్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా సి బిఐ విచారణ వద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిం ది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకో కుం డా ప్ర భుత్వాన్ని నిరోధించాలని కోరుతూ బిఆర్‌ఎస్ అధినేత, మా జీ ముఖ్యమంత్రి కెసిఆర్, మా జీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీశ్‌రావు దాఖలు చేసి న పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం వి చారణ చేపట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వమేమి జస్టీస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకు ఆదేశించలేదని, నేషనల్ డ్యామ్ సెఫ్టీ అ థారిటీ (ఎన్‌డిఎస్‌ఏ) నివేదిక ఆధారంగానే సిబి ఐ విచారణ జరపాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి తన వా దనలు వినిపించారు. ఇప్పటికే ఎన్‌డిఎస్ ఎ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభు త్వం లేఖ రాసిందని ఎజి గుర్తు చేసారు.’

కాళేశ్వరం నిర్మాణ లోపాలు ఉన్నట్లు ఎన్‌డిఎస్‌ఎ ని వేదిక ఇచ్చిందని తెలిపారు. ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్, నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నాయని వెల్లడించిందని వివరించారు. ఇదే విషయాన్ని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కూడా గు ర్తించిందన్నారు. ఎన్‌డిఎస్‌ఎ నివేదికపై అసెంబ్లీలో చ ర్చించామని తెలిపారు. 2022లో అప్ప టి ప్రభుత్వం రాష్ట్రంలోకి సిబిఐ రాకుం డా ఇ చ్చిన ఆదేశాలను సడలిస్తూ, తాజా గా రాష్ట్ర ప్ర భుత్వం జీవో విడుదల చేసిందని కూడా తెలిపా రు. సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని వెల్లడించారు. ని ర్మాణ లోపాల వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లందని చెప్పారు. కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందు కు సిబిఐ విచారణే సరైందని అసెంబ్లీ అభిప్రా య పడిందని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సిబిఐ దర్యాప్తునకు, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు ఎలాంటి సంబంధం లేదని ఎజి స్పష్టం చేశారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఈ పిటిషన్‌పై లోతైన విచారణ జరపా ల్సి ఉందని అభిప్రాయపడు తూ, కోర్టుకు వెకేషన్ అనంత రం దీనిపై విచారణ చేపడతామని పేర్కొంటూ, తదుపరి వి చారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేస్నుట్టు హైకోర్టు ప్రకటించింది. అప్పటివరకు పిటిషనర్లపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసిం ది. ఈ ఉత్తర్వులతో కెసిఆర్, హరీశ్‌రావుల కు తాత్కాలిక ఊరట లభించినట్టు అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News