హైదరాబాద్: సాధారణంగా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు అంత క్రేజ్ ఉండదు. ఒకప్పుడు విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’ సినిమా సూపర్‌హిట్ సాధించింది. ఆ తర్వాత చాలా రోజులకు అనుష్క శెట్టి నటించిన ‘అరుంధతి’ రికార్డు సృష్టించింది. ఆ తర్వాత అనుష్క ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలు ఆశించినంత విజయం సాధించలేదు. ఆ తర్వాత కొందరు హీరోయిన్లు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేసినా.. వారికి సక్సెస్ రాలేదు. (Kotha Lokah)
ఈ నేపథ్యంలో 2018లో వచ్చిన ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దివంగత నటి సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. కానీ, ఆ తర్వాత మళ్లీ ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు రాలేదు, వచ్చినా సక్సెస్ కాలేదు. కానీ, ఇప్పుడు ఓ సినిమా గతంలో వచ్చిన సౌత్ ఫిమేల్ సెంట్రిక్ సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. ఆ సినిమానే ‘కొత్త లోక’ (Kotha Lokah). కళ్యాణి ప్రియదర్శని నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మహానటి సినిమా రూ.84 కోట్ల వసూళ్లు రాబట్టగా.. కొత్త లోక రిలీజ్ అయిన ఏడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ దాటినట్లు తెలుస్తోంది. దీంతో మహానటి, అరుంధతి, భాగమతి, రుద్రమదేవి సినిమాల కలెక్షన్లను ఈ సినిమా అవలీలగా దాటేసింది.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. నస్లేన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించారు. జేక్స్ బెజాయ్ సంగీతం అందించారు. హీరోయిన్‌కి సూపర్ పవర్స్ ఉంటే ఆమె జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. మరి ఫుల్‌రన్‌లో ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Also Read : ‘సువర్ణ మాయ’ ఏం చేస్తుంది.. ‘కిష్కిందపురి’ ట్రైలర్ చూసేయండి