Friday, September 5, 2025

కెసిఆర్ పాలనలోనే స్వర్ణయుగం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/మర్కుక్ : మల్లన్నసాగర్, కొండపొచమ్మ సాగర్ లతో రాబోయే 50 ఏండ్ల హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చిన దార్శనికుడు కేసీఆర్ పై సిబిఐ విచారణ జరపడం సిగ్గుచేటు అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రా మారావు అన్నారు. సిబిఐని మోడీ జేబు సంస్థ అని రాహుల్ విమర్శిస్తే, రేవంత్ దా న్ని ప్రశంసించడం కాంగ్రెస్ దౌర్భాగ్యస్థితికి నిదర్శనమన్నారు.పినపాకనియోజకవర్గం, మణుగూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రభాకర్ రావు, ఆయన అనుచరులు రేగా కాంతాకావు ఆధ్వర్యంలో ఎ ర్రవల్లిలో కెటిర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పా ర్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కెటిఆర్, భారత దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా పదేళ్లలో కేసిఆర్ చేసినంత అ భివృద్ధి చేయలేదన్నారు.

కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్లు ఎర్రబడుతున్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటుంటే ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీలు కక్షపూరితంగా అక్రమ కేసులతో కేసీఆర్ ను బద్నాం చేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ఆగమాగమైందని, ప్రజలంతా కేసీఆర్ పాలననే తిరిగి కోరుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు. కేవలం 21 నెలల కాంగ్రెస్ పాలనలోనే ప్రజలు విసిగిపోయారని, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని ప్రతి ఒక్కరూ అంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని విరుచుకుపడ్డారు.

ఎన్నికలకు ముందు హామీల జాతర, ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్టుగా రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోందన్నారు. ‘వ్యవసాయ సొసైటీల ముందు రైతులు చెప్పుల వరుసలు పెట్టి పడిగాపులు కాయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ కల్పించిందన్నారు. ఆనాటి దుర్భర రోజులను మళ్లీ తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను నిజాయితీగా మోసం చేశాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 2014లో వ్యవసాయ దిగుబడుల్లో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను, కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులతో సస్యశ్యామలం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు కేటీఆర్. సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తున ఉన్న మేడిగడ్డ నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించే అద్భుతమైన, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం అన్నారు. ఈ ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఎన్నో గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు.

సింగరేణి కార్మికుల సంక్షేమానికి అండగా నిలిచాం :
సింగరేణి కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో చేసిందన్న కేటీఆర్, వారసత్వ ఉద్యోగాలు కల్పించడం నుంచి ఆరోగ్య సమస్యల వరకు అన్ని విధాలా అండగా నిలిచిందని కేటీఆర్ గుర్తుచేశారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన పది హామీల్లో ఎనిమిదింటిని పూర్తిగా, రెండింటిని పాక్షికంగా అమలు చేసిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. అయినప్పటికీ సింగరేణి ప్రాంతంలోని 13 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఎందుకు ఓడిపోయిందనే దానిపై లోతుగా అధ్యయనం చేయాలన్నారు. పార్టీకి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంకు మధ్య సమన్వయం లోపించిందా? యూనియన్ అంతర్గత రాజకీయాలు పార్టీపై ప్రభావం చూపించాయా? అనే కోణంలో ఆనాడు చర్చించామని చెప్పారు. పార్టీ మద్దతు లేకున్నా, మణుగూరు డివిజన్‌లో కేవలం 24 ఓట్ల తేడాతోనే యూనియన్ నాయకులు ఓడిపోయారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News