Thursday, September 4, 2025

టీమిండియా క్రికెటర్లకు భారీ ఊరట..

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా క్రికెటర్లకు భారీ ఊరట లభించింది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు భారత క్రికెట్ బోర్డు కొత్తగా బ్రాంకో టెస్ట్‌ను అమలు చేయాలని భావించింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో బిసిసిఐ వెనుకడుగు వేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే యోయోతో పాటు బ్రాంకో టెస్ట్‌లోనూ పాస్ కావాల్సిందేనని బిసిసిఐ పట్టుబట్టిన సంగతి తెలిసిందే.

రగ్బీ ఆటగాళ్ల కోసం ఉపయోగించే బ్రాంకో టెస్టును క్రికెటర్లకు వర్తింప చేయాలని చూడడం సరికాదని పలువురు మాజీ క్రికెటర్లు, కోచ్‌లు బిసిసిసి పెద్దలకు సూచించారు. అంతేగాక టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించాలనే ఉద్దేశంతోనే బ్రాంకో టెస్ట్‌ను బిసిసిఐ అమలు చేస్తుందని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. బ్రాంకో టెస్ట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో బిసిసిఐ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు సమాచారం. ఇప్పట్లో ఈ టెస్ట్‌ను అమలు చేసే ఉద్దేశంలో బిసిసిఐ లేదని తెలిసింది. దీంతో క్రికెటర్లకు పెద్ద ఊరట లభించిందని చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News