Thursday, September 4, 2025

హరీశ్, సంతోష్ జలగలు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌తో కుమ్మక్కయారు గజ్వేల్‌లో కెసిఆర్‌ను, నిజామాబాద్‌లో నన్ను, సిరిసిల్లలో కెటిఆర్‌ను ఓడించే
కుట్రలు చేశారు సిఎం రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు విమానంలో కలిశాకే కుట్రలు మొదలయ్యాయి
హరీశ్‌రావు ట్రబుల్ షూటర్ కాదు..బబుల్ షూటర్..ట్రబుల్ మేకర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని
దక్కించుకునే కుయుక్తులు మీ చుట్టూ ఏం జరుగుతోందో చూసుకోండి నాన్న హరీశ్ నక్కజిత్తుల వేషాలు ఓ కంట
కనిపెట్టండి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? వివరణ అడగకుండానే నన్ను ఉరి తీశారు
హరీశ్, సంతోష్‌ను పక్కనపెడితేనే పార్టీ బాగుపడుతది జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా
సమావేశంలో కవిత సంచలన ఆరోపణలు ఎంఎల్‌సి పదవికి, బిఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫోన్ చేసి రాజీనామా ఆమోదించాలని కోరిన కవిత

మన తెలంగాణ/హైదరాబాద్ : బీఆర్‌ఎస్ ను హస్తగతం చేసుకోవడానికి కుట్ర జరుగుతోందని బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ క ల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ చేసారు. సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు కుమ్మక్కు అయ్యాకే నా పై కుట్రలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. హరీశ్ ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్…ట్రబుల్&క్రియేటర్ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబం పై కుట్రలు పన్నడం 2018 నుంచే ప్రారంభం అయిందని, అప్పటి ఎన్నికలలో గజ్వల్‌లో కేసీఆర్‌ను, గత ఎన్నికలలో సిరిసిల్లలో కేటీఆర్ ను, నిజామాబాద్‌లో తనను ఓడగొట్టడానికి హరీష్ రావు ప్రయత్నించారని విమర్శించారు. సిరిసిల్ల లో తమ బంధువుకే రూ. 60 లక్షలు ఇచ్చి కెటీఆర్‌ను ఓడగొట్టడానికి ప్రయత్నించారని చెప్పా రు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మా ట్లాడుతూ పార్టీలో అంతర్గతంగా జరిగిన అనేక అంశాలను బహిర్గతం చేసారు. హరీశ్‌రావు, సం తోష్‌కుమార్ తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని, చేస్తున్నారని ఆరోపించారు.

‘పదవులు పోతే, సస్పెండ్ చేస్తే పోయే బంధం కాదు మా ది’ అని గద్గద స్వరంతో ఆమె వాపోయారు. త మ కుటుంబం విచ్ఛిన్నం అయితే రాజకీయంగా లబ్ధిపొందాలనే ఆలోచనతో పార్టీలో ఉన్నావారే ఇదంతా చేస్తున్నారని
ధ్వజమెత్తారు. మేము ముగ్గురం (కేసీఆర్, కేటీఆర్, కవిత) కలిసి ఉండకూడదు, మా కుటుంబం బాగుండవద్దని కోరుకుంటున్నారని, మా కుటుంబం విచ్ఛిన్నమైతే పార్టీని హస్తగతం చేసుకోవాలన్న దుర్భుద్ధితో కుట్రలకు తెర తీశారని ఆరోపించారు. హరీష్‌రావు, సంతోష్ కుమార్ పార్టీలో మేకవన్నె పులులు అని, జలగల్లా పట్టి అవినీతికి పాల్పడుతున్నారనే విషయాన్ని తాను ముందునుంచి కెసిఆర్‌ను హెచ్చరిస్తూ వచ్చినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే తనను పార్టీలో నుంచి బయటకు పంపారు. నన్ను పార్టీ నుంచి తాత్కాలికంగా విజయం సాధించామని సంతోషపడవచ్చు, కానీ మున్ముందు నాకు జరిగినట్టే కేసీఆర్‌కు, కెటీఆర్‌కు వీరి వల్ల ప్రమాదం పొంచిఉందని, వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని కవిత సూచించారు.

మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోవాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతానని నన్ను బయటకు పంపారు. భవిష్యత్తులో ఇదే ప్రమాదం కెసిఆర్, కేటీఆర్‌కు కూడా పొంచి ఉందని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ను హస్తగతం చేసుకునే కుట్రలో భాగంగానే తనను బయటకు పంపారని కవిత పేర్కొన్నారు. నెరెళ్లలో ఇసుక లారీ ప్రమాదంలో 30 మంది దళితులను సిఎంఓ నుంచి ఆదేశాలు ఇచ్చి కొట్టించింది సంతోష్ కుమార్ అని ఆమె ఆరోపించారు. ఈ అంశంలో కెటిఆర్ బదనాం అయ్యారు కానీ చేసిందంతా సంతోష్ అని ఆమె పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీష్‌రావు, సంతోష్ ఇద్దరి పాత్ర ఉందని, ఆ డబ్బులతోనే సంతోష్ కుమార్ తనకు బినామీ అయిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో ‘మెగా’ సంస్థలో డైరెక్టర్ అయిన శ్రీనివాసరెడ్డి మోకిలాలోని రియల్ ఎస్టేట్ కంపెనీలో రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టించారని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి అంత డబ్బు ఎక్కడిది ? అది సంతోష్ కుమార్ ది కాదా అని ప్రశ్నించారు.

హరీశ్‌రావు, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? అని కవిత ప్రశ్నించారు. పార్టీ క్రమశిక్షణరు ఉల్లంఘించారన్న అభియోగంపై తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసారని, సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉండాలని చెప్పడం క్రమశిక్షణ తప్పినట్టు అవుతుందా అని ఆమె నిలదీసారు. కేసీఆర్ స్ఫూర్తిగానే సామాజిక తెలంగాణ గురించి తాను మాట్లాడానని తెలిపారు. సామాజిక తెలంగాణ పేరిట పార్టీ పెడుతున్నానని తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. సామాజిక తెలంగాణ బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకమా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా? బంగారు తెలంగాణ కావాలని నినాదం ఇచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. తాను భవిష్యత్‌లో ఏం చేయాలన్నది మేధావులు, బీసీ నేతలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరేది లేదని ఆమె స్పష్టం చేశారు.

అవి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎలా అవుతాయి
నవంబరు 23 నుంచి 47 నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడానని కవిత తెలిపారు. బీఆర్‌ఎస్ జెండా కప్పుకుని ప్రజా సమస్యలపై మాట్లాడానని అన్నారు. తాను చేసిన పనులన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలా అనేది తనకు తెలియదని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎలా అవుతాయనేది పార్టీ పెద్దలు ఆలోచించుకోవాలన్నారు. పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ తనపై కుట్రలు జరుగుతున్నట్లు చెబితే కేటీఆర్ ఒక్కమాట మాట్లాడారా అని అడిగారు. తాను మాట్లాడితేనే స్పంద న రాకపోతే మహిళా కార్యకర్తలకు ఎలా స్పందన వస్తుందని నిలదీశారు. మొదటిసారి తెలంగాణ భవన్‌లో మహిళా నాయకురాళ్లు ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడడం అనేది చాలా హర్షించ దగ్గ విషయమని, తాను మొదటి నుంచి కోరుకున్నది పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమేనని అన్నారు. వారికి ఇప్పటికైనా తన వల్ల స్వేచ్ఛ వచ్చిందని వ్యాఖ్యానించారు.

హరీశ్‌రావు, సీఎం ఒకే విమానంలో వెళ్లినప్పుడు
ఈ కుట్రలు జరిగాయా?
రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు ఒకే విమానంలో ప్రయాణించినప్పుడు కుట్రలు మొదలయ్యాయని కవిత ఆరోపించారు. తమ కుటుంబాన్ని విడగొట్టాలనే కుట్రలు మొదలయ్యాయని, సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు ఒకే విమానంలో ఇద్దరూ కలిసి ప్రయాణించారా? లేదా? జవాబు ఇవ్వాలన్నారు. రేవంత్‌రెడ్డిపై పోరాడుతున్నందున తమ కుటుంబంపై కుట్రలు జరుగుతాయన్నారు. తనపై కుట్రలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయో హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి చెప్పాలని ఆమె సూటిగా ప్రశ్నించారు. హరీష్ రావు సీఎం రేవంత్‌రెడ్డితో మిలాఖత్ కావడం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని కెసిఆర్‌పైకి నెట్టాలని చూస్తున్నారని కవిత ఆరోపించారు. హరీష్‌రావుపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సిఎం ఎందుకు స్పందించడంలేదని ఆమె ప్రశ్నించారు. వీరిద్దరూ కలిసిపోయారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని అన్నారు. సంతోష్ కుమార్‌కు సంబంధించిన టానిక్ మద్యం షాపుల ఆరోపణపై కేసు నమోదు చేసి వెంటనే ఎందుకు ఉప సంహరించుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నానని అన్నారు. హరీష్‌రావు, సంతోష్ ఇద్దరు కూడా రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారని ఆమె ఆరోపించారు.

24 గంటల ముందే రాఖీ కడదామని
రామన్నకు మెసేజ్ చేశా
బీఆర్‌ఎస్ నుండి సస్పెండ్ చేసిన తరవాత కవిత మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పై ఎలాంటి విమర్శలు చేయకుండా హరీష్ రావు, సంతోష్ రావులపై అనేక ఆరోపణలు చేశారు. ఆ ఇద్దరి కుట్ర వల్లనే తనను బహిష్కరించినట్టు తెలిపారు. “నాన్న జాగ్రత్త, రామన్నా ఆ ఇద్దరితో జాగ్రత్త” అని హెచ్చరించారు. ఇక మీడియా సమావేశంలో తాను కేటీఆర్ కు రాఖీ ఎందుకు కట్టలేకపోయారో వివరించారు. 24 గంటల ముందే కేటీఆర్‌కు తాను వస్తానని మెసెజ్ చేసినట్టు తెలిపారు. మీడియా లేకుండానే రాఖీ కట్టేందుకు వస్తానని చెప్పానన్నారు. కానీ రామన్న ఏదో బిజీగా ఉండి ఎక్కడికో వెళ్లారని, అది అర్థం చేసుకుని సైలెంట్ గా ఉన్నానని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్తో తనది రక్త సంబంధం అని పార్టీలు పోతేనో, పదవులు పోతేనో విడిపోయే బంధం కాదని చెప్పారు. బీఆర్‌ఎస్ను హస్తగతం చేసుకోవడానికే తనను ఎలిమినేట్ చేశారని చెప్పారు. రేపు కేటీఆర్ కావచ్చు, ఎల్లుండి కేసీఆర్ కావచ్చు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News