Thursday, September 4, 2025

తొలి ఐదు నెలల్లో ద.మ. రైల్వే స్థూల ఆదాయం రూ.8,593 కోట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఆర్థిక, వివిధ విభాగాలలో అసాధారణమైన పనితీరును ప్రదర్శిస్తోందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- నుండి ఆగస్టు వరకు తొలి ఐదునెలల్లో మునుపెన్నడూ లేనివిధంగా అత్యుత్తమ స్థూల ఆదాయం (ఓరిజినేటింగ్) రూ.8,593 కోట్లను సాధించిందని తెలిపారు. 60.4 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయబడిందన్నారు. 100 శాతం విద్యుదీకరణ (నిర్మాణంలో ఉన్న కొత్త లైన్లు మినహా). పూర్తయ్యిందన్నారు. జెడ్‌ఆర్‌యుసిసి చైర్మన్ అయిన జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ అధ్యక్షతన 76 వ జోనల్ రైల్వే వినియోగదారుల సం ప్రదింపుల కమిటీ (జెడ్‌ఆర్‌యూసిసి) సమావేశం బుధవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగింది. ఈ సమావేశంలో జెడ్‌ఆర్‌యూసిసి కార్యదర్శి, దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయనాథ్ కోట్ల, వివిధ విభాగాల ప్రధాన అధిపతులు పాల్గొన్నారు. వీరితోపాటు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి (ఒంగోలు), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), డి.కె. అరుణ (మహబూబ్ నగర్), జి.ఎం. హరీష్ బాలయోగి (అమలాపురం), 22 మంది జెడ్‌ఆర్‌యూసిసి సభ్యులు, రాష్ట్ర ప్ర భుత్వాలచే ఎన్నుకోబడిన డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు (డిఆర్‌యూసిసిలు), వినియోగదారుల సంస్థలు, వాణిజ్య సంఘాలు, నమోదిత ప్రయాణీకు ల సమూహాలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జిఎం శ్రీ వాస్తవ మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే మీదుగా మొత్తం 6,532 రూట్ కిలో మీటర్ లలో 4,655 రూట్ కిలో మీటర్‌లకు భారతీయ రైల్వేల స్వదేశీ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ – కవచ్ తాజా వెర్షన్ 4.0 మంజూరు చేయబడిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, అనుసంధానం పెంపు, దక్షిణ మధ్య రైల్వే చివరి మైలు అనుసంధానం పై ప్రత్యేక శ్రద్ధతో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవం తం చేస్తోందన్నారు. కాజీపేట-బల్హర్షా, కాజీపేట-విజయవాడ, విజయవాడ-గూడూరు ట్రిప్లింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యే దిశలో ఉన్నాయన్నారు. జోన్ వ్యాప్తంగా 78 స్టేషన్లలో సిసిటివి నిఘా ఏర్పాటు, మరో 453 స్టేషన్లకు ప్రతిపాదనలు జరుగుతున్నాయన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 119 స్టేషన్ల ఆధునీకరణ జరుగుతోందన్నారు.

ప్రధాని ఇదివరకే బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లను ప్రారంభించారని గుర్తు చేశారు. అధునాతన ప్రయాణీకుల సౌకర్యాలను అందించడంలో భాగంగా 208 లిఫ్టులు, 92 ఎస్కలేటర్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయని జిఎం తెలిపారు. ఈ సంవత్సరం 7 లిఫ్టు లు, 4 ఎస్కలేటర్లు పూర్తిచేసి ప్రారంభించినట్లు తెలిపారు. 10 మానవసహిత లెవల్ క్రాసింగ్‌లు తొలగించబడ్డాయని, 7 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, 17 రోడ్ అండర్ బ్రిడ్జిలు నిర్మించినట్లు వెల్లడించారు. పార్లమెంటు సభ్యులు, ఇతర సభ్యులు ప్ర యాణీకుల సౌకర్యాలు, రైళ్ల స్టాప్ లు , నూతన రైళ్ల పరిచయం, సమయాల్లో మార్పు, వివిధ స్టేషన్లలో కొత్త లైన్లు, ఆర్‌యూ బిలు, ఆర్ ఓబిలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యలు, సూచనలను లేవనెత్తారు. సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రయాణీకుల సౌకర్యాలు, సేవలను మె రుగుపరచడానికి కొత్త ప్రణాళికలు, ప్రతిపాదనలను రూ పొందించేటప్పుడు జెడ్‌ఆర్‌యూసిసి సభ్యులు అందించిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుంటామని జెడ్ ఆర్‌యూసిసి సభ్యులకు హామీ ఇచ్చారు. దక్షిణ మధ్య రైల్వే పనితీరు, పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను దృశ్య మాధ్యమం ద్వారా సభ్యులకు వివరించారు. దక్షిణ మధ్య రైల్వే నిరంతర కృషికికి, సభ్యుల విజ్ఞాపనలపై సానుకూల స్పందనపై జెడ్‌ఆర్‌యూసిసి సభ్యులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News