- Advertisement -
కొచ్చి: కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాకు చెందిన అంజలి, అమెరికా వాసి రాబర్ట్ వెల్స్ మూడేళ్ల క్రితం ఫ్రాన్స్‌లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఇద్దరూ ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లారు. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఇరుకుటుంబాల పెద్దలు దీనికి అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఓనం పండగ సందర్భంగా ఇద్దరూ అంజలి స్వస్థలమైన కొచ్చికి వచ్చారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ తన భర్త రాబర్ట్‌కు భారతీయ సంస్కృతి అంటే ఇష్టమని చెప్పారు. ముఖ్యంగా కేరళ వంటకాలంటే చాలా మక్కువ చూపిస్తారని తెలిపారు. తమ అల్లుడు అమెరికా వ్యక్తి కావడం చాలా సంతోషంగా ఉందని అంజలి తల్లిదండ్రులు చెప్పారు.
- Advertisement -