కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లోని గ్రానైట్ అసోసియేషన్ నాయకులకు ఝలక్ ఇచ్చారు. 20 ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారులంతా బీఆర్‌ఎస్‌కు దోచిపెడుతూనే ఉన్నారని, ఇంకెన్నాళ్లు దోచిపెడతారని ప్రశ్నించారు. ఒక్కో గ్రానైట్ కటింగ్ మి షన్ దుకాణం నుండి సభ్యత్వం పేరుతో గ్రానైట్ అసోసియేషన్ రూ.10 లక్షల నుండి రూ.50 లక్షలదాకా వసూలు చేసిందని, ఆ సొమ్మును ఏం చేశారని చెప్పాలన్నారు.గ్రానైట్ వ్యాపారు ల నుండి వెయ్యి కోట్లు తీసుకున్నట్లు నాపై కొందరు దృష్ప్రచారం చేస్తూ నిందలేసినా ఖం డించలేదని వారిపై మండిపడ్డారు. గురువారం గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తొలుత మానకొండూరు చెరువు వద్దకు వచ్చారు. అక్కడ గ్రా నైట్ అసోసియేషన్ నాయకులు తిరుపతి గౌడ్ తోపాటు మరికొందరు నాయకులు ఎదురుపడ్డారు.
ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లాచ్చాక వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయని, గ్రానైట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని గ్రానైట్ అసోసియేషన్ నేతలు చెప్పారు. ఆ వెంటనే సంజయ్ స్పందిస్తూ “మరి కనీసం ప్రెస్ మీట్ పెట్టి మోదీకి థ్యాంక్స్ అయినా చెప్పారా? ఎందుకు చెప్పలేదు? గత 20 ఏళ్లుగా మీరంతా బీఆర్‌ఎస్ కు దోచిపెడుతూనే ఉన్నారు. మీలో కొందరు వ్యాపారాల కోసం రాజకీయాలను వాడుకుంటున్నారని అన్నారు. కొందరు రాజకీయ నాయకులై వ్యాపారాలను పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. వచ్చిన సొమ్ముతో రాజకీయాలు చేస్తారు.. మాలోంటోళ్లను ఓడగొట్టాలని చూస్తారు.”అని చురకలంటించారు. గ్రానైట్ అసోసియేషన్ నుండి బండి సంజయ్ కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడంటూ గతంలో జరిగిన దృష్ప్రచారాన్ని ఈ సందర్భంగా సంజయ్ వారి వద్ద ప్రస్తావించారు.
ఏనాడై నా మీరు నాకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? నేను గెలిచిన తరువాత కూడా మీలో ఒ క్కరైనా నా దగ్గరకు వచ్చి కనీసం బొకే అయినా ఇచ్చారా? ఒక్క స్వీటు ముక్క కూడా తిన్పిం చలేదు కదా.. కానీ బయట మాత్రం కొందరు నాకు 700 కోట్ల రూపాయలు ఇచ్చారని నిం దలేస్తుంటే మీ అసోసియేషన్ కనీసం ఖండించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా వందల కోట్ల రూపాయలను బీఆర్‌ఎస్‌కు దోచి పెట్టి ఆ పార్టీని ఇంకా సాదుతున్నారని న్నారు. కానీ సమాజానికి సేవ చేయాలనే ఆలోచన మాత్రం మీకు రావడం లేదు.”అని వ్యాఖ్యానించారు. రూ. 300 కోట్లకు మించి లేదు. బయటకు పోయి మాత్రం వెయ్యి కోట్లు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. వసూలు చేసింది. దాదాపు 350 నుండి 500 షాపుల దాకా డ బ్బులు వసూలు చేసినట్లు సమాచారం ఉందన్నారు. మరి ఆ సొమ్మును ఏం చేశారు? సమా జానికి ఏమైనా సేవ చేశారా? గణేశ్ పండుగ సందర్భంగా గల్లీగల్లీలో గణేష్ మండపాలు పెడతారు…
కనీసం తట్టెడు మట్టి పోశారా? కరెంట్ బిల్లులైనా కట్టారా? అధికారులు, పోలీసు లు సొంతంగా ఖర్చు పెట్టుకుని తిండి తింటూ రాత్రింబవళ్లు డ్యూటీ చేస్తున్నారు. అట్లాంటి వాళ్లకు భోజన..కనీసం మంచి నీళ్ల సదుపాయాలైనా కల్పించారా? అవేమీ చేయరు. మరి వ సూలు చేసిన కోట్ల రూపాయలను ఏం చేశారు? తీస్తా..ఆ లెక్కలన్నీ త్వరలోనే బయటకు తీ స్తా…అని అన్నారు. దీంతో ఖంగుతిన్న దీంతో ఖంగుతిన్న గ్రానైట్ అసొసియేషన్ నాయకులు సమాజానికి సేవ చేస్తామని అందులో భాగంగానే గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్లను ఏ ర్పాటు చేశామని చెప్పారు. త్వరలోనే మోదీకి సైతం థ్యాంక్స్ చెబుతామని, గ్రానైట్ అసోసి యేషన్ పేరుతో సమాజానికి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ ఎవ్వరికీ పైసలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితిని కల్పిస్తానని, సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు చేయాలని సూచిస్తూ ముందుకు సాగారు.