ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న యూనిక్ ఎంటర్‌టైనర్ ఆంధ్రా కింగ్ తాలూక. మహేష్ బాబు.పి దర్శకత్వంలో ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. అద్భుతమైన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. రామ్ పోతినేని స్వయంగా రాసిన, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ పాడిన ఫస్ట్ సింగిల్ వైరల్ అయ్యింది. ప్రస్తుతం మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు సెకెండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వివేక్, మెర్విన్ సంగీతం అందించిన ఫన్నీ నంబర్ పప్పీ షేమ్ ఆగస్టు 8న విడుదల కానుంది.
పోస్టర్‌లో రామ్ ఎనర్జిటిక్‌గా కనిపించారు. భారీగా జనం వున్న థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో జరుపుకుంటున్నట్లు చూపించడం ఆసక్తికరంగా వుంది. ఆంధ్రా కింగ్ తాలూకాలో రామ్ డై-హార్డ్ సినిమా ఫ్యాన్ గా అలరించబోతున్నారు, ఇది ఒక అభిమాని బయోపిక్ గా ఉండబోతోంది. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించగా, ఉపేంద్ర సూపర్ స్టార్ పాత్రలో కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
Also Read : అదరగొట్టిన ‘ఘాటీ’ రిలీజ్ గ్లింప్స్..