Friday, September 5, 2025

హాలీవుడ్ స్థాయిలో ‘మిరాయ్’

- Advertisement -
- Advertisement -

సూపర్ హీరో తేజ సజ్జా నటిస్తున్న పాన్- ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “దర్శకుడు కార్తిక్ చెప్పిన కథ చాలా నచ్చింది. శ్రీరాముల వారి నేపధ్యం, తొమ్మిది పుస్తకాల బ్యాక్‌డ్రాప్, ఇతిహాసాల కోణం చాలా అద్భుతంగా వుంటుంది.

ఇందులో నా క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా వుంటుంది. బద్దకంగా ఉండేవాడు బ్రతకకూడదనే క్యారెక్టర్. కార్తిక్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. -రజినీకాంత్‌కి మిరాయ్ ట్రైలర్ చూపించాను. ఆయనకు చాలా నచ్చింది. ఇలాగే మంచి సినిమాలు చేస్తూ గ్యాప్ లేకుండా సినిమాలు చేయమని చెప్పారు. మంచి ఎనర్జీ ఇచ్చారు. -మిరాయ్ యాక్షన్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్ అలవాటు. హైదరాబాద్‌లో జాక్సన్ మాస్టర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. దాదాపు 8 నెలల ప్రాక్టీస్ చేశాను. మిరాయ్ నా కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతుంది. -తేజ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. సినిమా చూస్తున్నప్పుడు తన హార్డ్ వర్క్ మీకు కనిపిస్తుంది.

తన అనుభవంతో కార్తీక్ హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తీశారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను. విశ్వ ప్రసాద్ చాలా గ్రాండ్ స్కేల్లో సినిమా తీశారు. ప్రస్తుతం నేను నటిస్తున్న డేవిడ్ రెడ్డి, రక్షక్ సినిమాలు జరుగుతున్నాయి. ఈ రెండు కూడా భారీ యాక్షన్ ఉన్న సినిమాలు. అలాగే ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న స్క్రిప్ట్ కోసం కూడా చూస్తున్నాను. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. -అహం బ్రహ్మాస్మి సినిమా కూడా సమయం వచ్చినప్పుడు వస్తుంది. అలాగే వాట్ ద ఫిష్ సినిమా కూడా చేయాలి. చాలా డార్క్ కామెడీ ఉన్న సినిమా అది” అని అన్నారు.

Also Read : థ్రిల్లర్ డ్రామాగా అల్లరి నరేష్ ’ఆల్కహాల్’.. టీజర్ వచ్చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News