Friday, September 5, 2025

వినాయక చవితి వేడుకల్లో దంపతులపై కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: వినాయక చవితి వేడుకల్లో దంపతులపై ఓ యువకుడి కత్తితో దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. తణుకులో శంకర్ రావు, నాగమణి అనే దంపతులు వినాయక ఊరేగింపులో పాల్గొన్నారు. సంజయ్ అనే యువకుడు దంపతులతో గొడవపడ్డాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో వారిపై సంజయ్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.  తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్సత్రికి తరలించారు. దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సంజయ్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News