- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టపగలే జరిగిన హత్య కలకలం రేపింది. రైల్వే స్టేషన్ సమీపంలోని కొత్తపేటలోని ఉషోదయ స్కూల్ సమీపంలో లోకేష్ అనే రౌడీషీటర్ (40)ను దుండగులు హత్య చేశారు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అతడిని కారుతో ఢీకొట్టి అనంతరం కత్తులతో దాడి చేసి చంపేశారు. స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఓ మహిళ హత్య కేసులో లోకేష్ నిందితుడిగా ఉండడంతో అతడిని నరికి చంపినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.
- Advertisement -