Saturday, September 6, 2025

శనివారం రాశి ఫలాలు (06-09-2025)

- Advertisement -
- Advertisement -

మేషం –  ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంస్థపరమైనటువంటి పురోగతిని సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా మేలు జరుగుతుంది.

వృషభం – భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. రాబడి అధికంగా ఉంటుంది. మీలోని ప్రతిభ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.

మిథునం – చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. స్వల్ప ధన లాభ సూచన.

కర్కాటకం – చెల్లించవలసిన రుణాలకి ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక పరిస్థితి ఓ మోస్తరుగా ఉంటుంది. విద్యారంగంలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్నింటా అనుకూలంగా వుంటుంది.

సింహం – క్రయక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. తగిన జాగ్రత్త వహించండి. మీ ప్రణాళికలు వ్యూహాలు చాలావరకు ఫలిస్తాయి.

కన్య –  కీలక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది తొందరపాటు తగదు. ఆత్మీయులతో ఏర్పడిన అంతర్గత విభేదాలు తలనొప్పిగా పరిణమిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి.

తుల – మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరిశోధనా విషయాలపై ఆసక్తి చూపుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కీలకమైన ఒప్పందాలను చేసుకుంటారు.

వృశ్చికం – ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. సంతాన పురోగతి బాగుంటుంది. ఆర్దిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది.

ధనుస్సు – క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైన అధిగమిస్తారు. కార్యాలయాలలో మరింతగా శ్రమించి పని చేయవలసి ఉందని నిర్ణయించుకుంటారు.

మకరం – వృత్తి ఉద్యోగాలపరంగా మీదే పైచేయిగా ఉంటుంది. మీ మనోగతాన్ని బయటపెట్టరు మాటలకన్నా చేతలతోనే పనితనాన్ని చూపించడానికి ఇష్టపడతారు. నైతిక విలువలకు ప్రాధాన్యతని ఇస్తారు.

కుంభం – శ్రమ అధికంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సుదూర ప్రాంత ప్రయాణాలకు అనువైన సమయం కాదు. ఆరోగ్యం వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు.

మీనం – ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా కనబరిచే ఓర్పు మంచి ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ముఖ్యమైన అన్ని విషయాల పట్ల జాగ్రత్తగా మెలగడం చెప్పదగినది.

Rasi phalalu cheppandi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News