ముంబై: సోషల్‌మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీల గురించి తెలుసుకోవడం ఎంతో సులభంగా తెలుసుకొనే వీలు కలిగింది. సెలబ్రిటీలు కూడా తమ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే సోషల్‌మీడియా వల్ల కొందరు సెలబ్రిటీలు ఇబ్బందిపడటం కూడా జరుగుతోంది. ఎంతోమంది సెలబ్రిటీలపై ఎన్నో విధాలుగా రూమర్స్ పుట్టిస్తుంటాడరు. దానిపై కొందరు సెలబ్రిటీలు క్లారిటీ ఇస్తే.. మరికొందర మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తారు. తాజాగా టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌కి (Sara Tendulkar) కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సారాకు నిశ్చితార్థం జరిగిందంటూ.. సోషల్‌మీడియాలో ఫోటోలు ప్రచారం అయ్యాయి.
ఇటీవలే సచిన్ కుమారుడు, సారా సోదరుడు అర్జున్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలు సానియా చందోక్‌తో అర్జున్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. అయితే ఇప్పుడు సారాపై (Sara Tendulkar) గతంలో కొన్ని రూమర్స్ వచ్చాయి. టీం ఇండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని పుకార్లు వినిపించాయి. అయితే దీనిపై సారా కానీ, గిల్ కానీ స్పందించలేదు. తాజాగా ఓ వ్యక్తితో సారా సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గోవాకు చెందిన ఆర్టిస్ట్ సిద్ధార్త్ కేర్కర్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు పుట్టుకొస్తున్నాయి. పలు ఐపిఎల్ మ్యాచ్‌లకు అతడు సారాతో పాటు హాజరయ్యాడు. అంతేకాక.. సారాతో పాటు సచిన్ కుటుంబంతో కూడా సిద్ధార్త్ సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో సారా-సిద్ధార్త్‌లు ప్రేమలో ఉన్నారని.. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి.. వీరికి నిశ్చితార్థం జరిగిందని వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. నిజానికి సిద్ధార్త్‌కు గోవాలో ఓ రెస్టారెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి ఇన్‌స్టాలో 90 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. సారాతో మాత్రమే కాదు.. వివిధ మోడల్స్‌తో దిగిన ఫోటోలను అతడు పోస్ట్ చేస్తుంటాడు. అలాగే సారాతో దిగిన ఫోటోలు అతను పోస్ట్ చేశాడు. సారా కూడా మోడలింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Also Read : ఆ సత్తా కోహ్లి, రోహిత్‌కు ఉంది.. విమర్శలపై దీప్‌దాస్ గుప్తా..