- Advertisement -
అమరావతి: గురువును దైవంతో సమానంగా పూజించే సంస్కృతి మనది అని ఎపి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. శిష్యుల ఉన్నతిలోనే విజయాన్ని చూసుకుంటారు ఉపాధ్యాయులు అని అన్నారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ..గురుపూజోత్సవం సందర్భంగా టీచర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల దశ నుంచే విద్యార్థులకు నైతిక విలువలు కూడా నేర్పాలని, ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ చేసిందని అన్నారు. విధుల్లోకి రాబోతున్న ఉపాధ్యాయులకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.
Also Read : మహిళలకు అత్యంత భద్రత కలిగిన నగరం విశాఖ : చంద్రబాబు
- Advertisement -