హారర్ కామెడీ జోనర్ వచ్చే సినిమాలకు ఎప్పుడూ మంచి ప్రేక్షకాదరణ ఉంటుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ సినిమాలను అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్ కాగా.. కొన్ని మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. అయితే హారర్ కామెడీ జోనర్‌లో లేటెస్ట్‌గా వచ్చిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’ (Bakasura Restaurant). కామెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్, వైవా హర్షలు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు.
ఆగస్టు 8వ తేదీన విడుదలైన ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి బకాసుర రెస్టారెంట్ సినిమా ప్రముఖ ఒటిటి సంస్థ ‘సన్ నెక్ట్స్’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా విడుదల అయింది. ఇక ఈ సినిమాలో (Bakasura Restaurant) కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఎస్‌జె శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రెస్టారెంట్ బిజినెస్ పెట్టాలనేకొనే ఓ వ్యక్తి జీవితంలోకి బాగా ఆకలితో ఉండే ఆత్మ రావడం.. దానితో అతడు ఎదురుకున్న సమస్యలు ఏంటీ.. చివరకు ఆ వ్యక్తి రెస్టారెంట్ పెట్టాడా? లేదా? అనేదే ఈ సినిమా సారాంశం. మరి ఈ సినిమా ఒటిటిలో ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.
Also Read : హాలీవుడ్ స్థాయిలో ‘మిరాయ్’