ముంబై: బెంగాలీ నటి (Bengali Heroine) అనుష్క మోనీ మోహన్ దాస్(41) సినీ పరిశ్రమలో సినిమాలతో పాటు పలు టివి సీరియల్స్‌లో కూడా నటించి గుర్తింపు పొందింది. తాజాగా ఆమెను మహారాష్ట్రలోని ఠాణే పోలీసులు అరెస్ట్ చేశారు. కొంత యువతులతో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారెం అందించింది. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళిక ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు. అలాగే వ్యభిచార కూపంలో చిక్కుకున్న మరో ఇద్దరు హీరోయిన్లను కూడా రక్షించారు.
మొదట పోలీసులే కస్టమర్ల రూపంలో అనుష్క మోనీని (Bengali Heroine) సంప్రదించారు. ఒక మాల్‌లో ఆమె డబ్బు తీసుకుంటుండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెపై ఐపిసి సెక్షన్ 143(3) కింద, మానవ అక్రమ రవాణా, అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం కింద కేసు నమోదు చేశారు. రక్షింపబడిన మహిళలను షెల్టర్ హోమ్‌కు పోలీసులు తరలించారు. ఈ వ్యభిచార ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎసిపి బల్లాల్ తెలిపారు.
Also Read : కాంతార: ఛాప్టర్ 1.. ఎంతో రిస్క్ చేసిన రిషబ్ శెట్టి