- Advertisement -
అనకాపల్లి: చోడవరం (Anakapally Chodavaram) సబ్‌జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పారిపోయిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. జైలులో వంట పని కోసం ఖైదీలను బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో మాడుగుల చోరీ కేసులో రిమాండ్‌లో ఉన్న బెజవాడ రాము అనే ఖైదీ హెడ్‌వార్డర్ రాజుపై సుత్తితో దాడి చేశాడు. అనంతరం రాజు వద్ద నుంచి తాళాలు లాక్కున్నాడు. ఆ తర్వాత ప్రధాన ద్వారంకి తాళం వేసి పారిపోయాడు. అతన్ని వెతికి వస్తానని ఫింఛన్ డబ్బు కాజేసిన కేసులో రిమాండ్‌లో ఉన్న మరో ఖైదీ పంచాయతీ మాజీ కార్యదర్శి రవికుమార్ కూడా పరార్ అయ్యాడు. తలకు తీవ్రంగా గాయం కావడంతో హెడ్‌వార్డర్ రాజును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారైన ఇద్దరు ఖైదీల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read : ధర్మవరంలో పట్టపగలు నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
- Advertisement -