Saturday, September 6, 2025

మహిళా ఐపిఎస్ అధికారితో డిప్యూటీ సిఎం అజిత్ పవార్ వివాదం

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన మహిళా ఐపీఎస్ అధికారితో డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అజిత్ పవార్ మీకు అంత ధైర్యం ఉందాఅని ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణను మందలించిన వీడియో బయటపడడంతో వివాదంలో చిక్కుకున్నారు. షోలాపూర్ లోని కుర్దు గ్రామంలో రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే ముర్రం ను అక్రమంగా తవ్వుతుండగా, దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించి షోలాపూర్ లోని కర్మాల సబ్ డివిజన్ పోలీసు అధికారిణి అంజనా కృష్ణ తో అజిత్ పవార్ తీవ్ర ఆగ్రహంతో మాట్లాడినట్లు ఆ వీడియో వినిపించింది. కేరళకు చెందిన అంజనా కృష్ణ కు ఈ మధ్యనే మహారాష్ట్రకు పోస్టింగ్ ఇచ్చారు. ఆమె తన విధులు నిర్వహిస్తుండగా ఓ ఎన్సీపీ కార్యకర్త ఆమెకు ఫోన్ ఇచ్చి పవార్ ఫోన్ లో ఉన్నారని తెలిపారు. ఆ అధికారి అజిత్ పవార్ గొంతును గుర్తించలేదు. వీడియో కాల్ చేయవలసిందిగా ఆమె కోరారు.

దీంతో ఆగ్రహించిన అజిత్ పవార్ బిగ్గరగా నీకెంత ధైర్యం డిప్యూటీ ముఖ్యమంత్రిని వీడియో కాల్ చేయమంటావా.. నన్నే వీడియో కాల్ చేయమంటావా అని అరిచారు. ఆ తర్వాత ఆమెకి వీడియో కాల్ చేసి ఆమె తీసుకుంటున్న చర్యలను ఆపాలని ఆదేశించారు.మహిళా ఐపీఎస్ అధికారితో జరిగిన సంభాషణ వీడియో వైరల్ కావడంతో స్పందించిన అజిత్ పవార్ పోలీసులు అంటే, ముఖ్యంగా మహిళా పోలీసు అధికారిణులు అంటే అత్యంత గౌరవం ఉందని సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు. చట్టం అమలులో జోక్యం చేసుకోవడం తన ఉద్దేశ్యం కాదని, క్షేత్రస్థాయిలో పరిస్థితి దిగజారకుండా, చూసుకోవడం, పనులు పారదర్శకంగా జరిగేలా చూడడం తన ఉద్దేశం అని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్లలను శాంతింప జేయడానికి, ఆయన ఐపీఎస్ అధికారిని మందలించి ఉండవచ్చునని ఎన్ సీపీ సునీల్ తట్కరే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News