Saturday, September 6, 2025

భార్య చేతిలో భర్త హతం

- Advertisement -
- Advertisement -

భార్య చేతుల్లో భర్త హతమైన సంఘటన వికారాబాద్ జిల్లా, కోట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దారూర్ సిఐ రఘు రాములు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బసన్నుల్లా రామచంద్రయ్య (44) పంచాయతీ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి సుజాతతో 18 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు శ్రీలక్ష్మి, శ్రీలత. గత కొన్ని రోజులుగా సుజాత స్థానికంగా వద్దు అని, వేరేచోట ఉపాధి వెతుక్కుందామని తన భర్తతో తరచూ గొడవ పెట్టుకుంటూ ఉండేది. రామచంద్రయ్య మాత్రం వేరే ఊరు వెళ్లి బతకడానికి ఒప్పుకోకపోవడంతో తన భర్త అడ్డు తొలగించుకొని

ఎక్కడికైనా వెళ్లి బతకాలని నిర్ణయం తీసుకుంది. గురువారం అర్ధరాత్రి ఇంటి ముందు వాకిట్లో నిద్రిస్తున్న సమయంలో భర్త తలపై బండరాయితో కొట్టి చంపింది. స్థానికుల సమాచారం మేరకు  పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, భార్యను విచారించగా, తన భర్తను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. హతుడి అన్న బసన్నుల్లా అంజయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని మరుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రఘురాములు, ఎస్‌ఐ శైలజ తెలిపారు. కాగా, కుటుంబ పెద్ద మృతితో వారి ఇద్దరు చిన్నారులు రోడ్డు పాలయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News