Saturday, September 6, 2025

19న ‘వీర చంద్రహాస’

- Advertisement -
- Advertisement -

కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎంవి రాధాకృష్ణ తెలుగులో విడుదల చేస్తున్న కన్నడ చిత్రం ‘వీర చంద్రహాస’. సెప్టెంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఇటీవల ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించి మూడు వందల కోట్లు కలెక్షన్స్ రాబట్టిన మహావతార్ నరసింహ చిత్రం తర్వాత హోంబలే ఫిలిమ్స్ సమర్పణలో విడుదల చేస్తున్న వీర చంద్రహాస చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కేజీయఫ్, సలార్ లాంటి యాక్షన్ చిత్రాలకు సంగీతం అందించి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఒక సంచలనం సృష్టించిన రవి బస్రూర్.. ‘వీర చంద్రహాస’ చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగ, నాగరాజ్ సర్వెగర్, గుణశ్రీ ఎం నాయక్, శ్రీధర్ కాసర్కోడు, శ్వేత అరెహోల్, ప్రజ్వల్ కిన్నాల్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఓంకార్ మూవీస్ బ్యానర్‌పై ఎన్‌ఎస్ రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కన్నడలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల హీరో విశ్వక్ సేన్ విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. వీర చంద్రహాస అనేది ’మహాభారతం’లోని అశ్వమేధిక పర్వంలోని కథ. ఇది ఒక అనాథ కుర్రాడి గొప్ప కథను చెబుతుంది. చిత్ర నిర్మాత ఎంవి రాధాకృష్ణ మాట్లాడుతూ “కన్నడలో విడుదలైన ‘వీర చంద్రహాస’ చిత్రం హిట్ టాక్‌తో పాటు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీ తెలుగు రైట్స్ దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి తెలుగు ఆడియెన్స్ బ్రహ్మారథం పడతారని ఆశిస్తున్నా. తనదైన సంగీతంతో అందర్నీ మెప్పించిన రవి బస్రూర్ దర్శకుడిగానూ సత్తా చాటడం సంతోషంగా ఉంది” అని అన్నారు. సంగీత దర్శకుడు, దర్శకుడు రవి బస్రూర్ మాట్లాడుతూ.. “డైరెక్టర్‌గా నేను రూపొందించిన ఈ సినిమాను కన్నడ ప్రేక్షకులు బాగా ఆదరించారు. తెలుగు ఆడియెన్స్‌కు కూడా కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నా”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News