మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన పోరులో భారత మహిళా టీమ్ 11-0 గోల్స్ తేడాతో థాయిలాండ్‌ను చిత్తు చేసింది. చైనా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో 8 జట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో విజేతగా నిలిచే టీమ్ బెల్జియం వేదికగా జరిగే మహిళల ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తోంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఇక శుక్రవారం పూల్‌బిలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 11-0 తేడాతో థాయిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. ముంతాజ్ ఖాన్ ఏడో నిమిషంలోనే తొలి గోల్ చేసింది. 49వ నిమిషంలో ముంతాజ్ తన రెండో గోల్‌ను సాధించింది. ఉదిత, బ్యూటీడంగ్ డంగ్‌లు కూడా రెండేసి గోల్స్ చేశారు. దీంతో భారత్ తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.
ఆ సత్తా గంగూలీకి ఉంది.
జోహెన్నస్‌బర్గ్: రానున్న సౌతాఫ్రికా టి20ప్రీమియర్ లీగ్ సీజన్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ టీమ్‌కు భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ విషయాన్నిలీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించాడు. ప్రిటోరియా క్యాపిటల్స్ టీమ్ హెడ్ కోచ్‌గా గంగూలీ సక్సెస్ కావడం ఖాయమని స్మిత్ జోస్యం చెప్పాడు. అతని పర్యవేక్షణలో ప్రిటోరియా టీమ్ మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమన్నాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా గంగూలీ టీమిండియాపై తనదైన ముద్ర వేశాడన్నాడు. అతనిలాంటి క్రికెటర్ ప్రిటోరియా టీమ్‌కు ప్రధాన కోచ్‌గా రావడం గర్వంగా ఉందన్నాడు. గంగూలీపై ఉన్న అపార నమ్మకంతో ఫ్రాంచైజీ యాజమాన్యం అతనికి ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగించిందని,ఇందులో అతను సఫలం కావడం ఖాయమని స్మిత్ జోస్యం చెప్పాడు.