Saturday, September 6, 2025

రూ.1.10 లక్షలకు చేరువలో బంగారం ధర

- Advertisement -
- Advertisement -

బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి (24 క్యారెట్) ధర 760 పెరిగి రూ.1,07,770 కి చేరింది. ఇక వెండి కిలో ధర రూ.1000 తగ్గి రూ.1,26,000 కి చేరుకుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 10 గ్రాములు బంగారం (24 క్యారెట్) ధర రూ.760 పెరిగి రూ.1,07,620 కు చేరింది. ఇక వెండి కిలో ధర రూ.1000 తగ్గి రూ.1,36,000 కు చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధర రూ.30,176 (40%) పెరిగింది. 2024 డిసెంబర్ 31న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.76,162గా ఉండగా, ఇప్పుడు అది రూ.1,06,338కి చేరుకుంది. అదే సమయంలో వెండి ధర కూడా రూ.37,153 (43%) పెరిగింది. 2024 డిసెంబర్ 31న కిలో వెండి ధర రూ.86,017గా ఉండగా, ఇప్పుడు అది కిలోకు రూ.1,23,170కి చేరుకుంది. మార్కెట్ నిపుణుడు కేడియా కమోడిటీ ప్రకారం, 2025 చివరి నాటికి ఒక కిలో వెండి ధర రూ. 1.30 లక్షలకు చేరుకునే అవకాశముంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News